![]() |
![]() |

దీపావళి పండగకు చాలామంది కొత్త కొత్త వస్తువులు కొనుక్కుంటూ ఉంటారు. ఇక ఇలాంటి దీపావళిని పురస్కరించుకుని హిమజ తనకు తాను ఒక కార్ ను గిఫ్ట్ గా ఇచ్చుకుంది. బిగ్‌బాస్-3 సీజన్ లో కంటెస్టెంట్‌గా పార్టిసిపేట్ చేసి తనదైన స్టయిల్లో మిగిలిన ఇంటి సభ్యులకు గట్టి పోటీ ఇచ్చి.. కొన్నివారాలు హౌస్ లో కంటిన్యూ అయ్యింది.
బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక హిమజకు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగింది. సోషల్ మీడియాలో మంచి యాక్టీవ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. తనకు సంబంధించిన అన్ని విషయాలను, ఫోటో షూట్స్ ని తన ఫాన్స్ తో షేర్ చేసుకుంటుంది. లేటెస్ట్ గా ఒక మాంచి లగ్జరీ బిఎండబ్ల్యు కారుతో వీడియో దిగి.. తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది. "ఈ దీపావళికి నాకు నేను ఇచ్చుకున్న గిఫ్ట్. నా కల నేరవేరింది" అని రాసుకొచ్చింది. ఇక ఈ వీడియో ఎండింగ్ లో తాను కారు కొన్నట్టు కలగన్నట్లు చూపించింది. అది కల కాదు నిజం అంటూ కార్ తో ఫోటో దిగి చూపించింది హిమజ.
ఇక హిమజ కొన్ని సీరియల్స్ నటించింది. అలాగే కామెడీ షోల ద్వారా వచ్చిన క్రేజ్ తో వెండితెరపై మెరిసే అవకాశం సంపాదించింది. 'నేను శైలజ', 'శతమానం భవతి', 'వరుడు కావలెను' వంటి మూవీస్ లో నటించింది హిమజ.
![]() |
![]() |